prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 2:58 pm Digital Edition : VENU THIRUMALAYAPALEM

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు..ప్రధాని మోదీకి కృతజ్ఞతలు..

బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నల్లగట్టు శ్రీనివాస్..

తిరుమలాయపాలెం, ప్రజావాణి:

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గించిన ప్రధాని మోదీకి బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నల్లగట్టు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.ఓ ప్రకటనలో ఆయనమాట్లాడుతూ..సామాన్య,మధ్య తరగతి ప్రజలపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమన్నారు. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.10 వరకు ఎక్సైజ్ సుంకం తగ్గించగా, డీజిల్‌పై సుంకాన్ని పూర్తిగా రద్దు చేయడం ప్రజలకు పెద్ద ఊరటనిచ్చే చర్య అని పేర్కొన్నారు.ప్రజలకు ఉపశమనం కలిగించేలా తీసుకున్న ఈ నిర్ణయంతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించుకుందని ఆయన అన్నారు. ఇంధన కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ధరలు నియంత్రణలో ఉంచడం కేంద్ర ప్రభుత్వ సమర్థ పాలనకు నిదర్శనమని చెప్పారు.ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి మరియు కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు నల్లగట్టు శ్రీనివాస్ తెలిపారు.