prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 7:49 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేసి, క్రమం తప్పకుండ ఫీజు రియాంబర్షిమెంట్ ఇవ్వాలి.ఎస్ఎఫ్ఐ

ఎఫ్ ఆర్ ఎస్ ను రద్దు చేయాలనీ, హాస్టల్ మెస్స్ బిల్లు 3000 రూ. పెంచాలి.

కడప జూలై 02 ప్రజావాణి కలెక్టరేట్ ముందు నిరసనలకు పిలుపు.రాష్ట్రం లో చదువుతున్న విద్యార్థుల ఫీజు బకాయిలు ఏ ప్రభుత్వం మారిన కష్టాలు తప్పట్లేదు అని,తక్షణమే పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయాలనీ,హాస్టల్ విద్యార్థులకు మెస్స్ బిల్లులు 3000 రూ.లు కు పెంచాలని,ఎఫ్ ఆర్ ఎస్ ను రద్దు చేయాలని జులై 6 వ తేదీన భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ)రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమానికి పిలునిచ్చి అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద పోస్టల్ విడుదల చేసిన కడప ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జాల సుమంత్,వీరపోగు రవి.అనంతరం వారు మాట్లాడుతూ.రాష్ట్రం లో గత ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించి ఇకపై విద్యార్థులు కు ఫీజుల సమస్య లేకుండ సకాలంలో చెల్లించి సక్రమంగా చదువు కొనసాగేలా చేస్తామని చెప్పిన విద్యా శాఖ మంత్రి లోకేష్ గారు నేడు ఆ ఊసే ఎత్తకుండా ఫీజుల బకాయిలు మరింత భారంగా మారి నేడు రాష్ట్రం లో,జిల్లా లో విద్యార్థులు భవిష్యత్తు,ఉన్నత చదువులు గందరగోళంగా మారింది అని తక్షణమే ఫీజు బకాయిలు విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.గత కొన్ని సంవత్సరాలనుండి హాస్టల్ విద్యార్థులు సమస్యలు,మెస్స్ బిల్లు లు పెంచడం లో పూర్తిగా విఫలం అయింది అని అన్నారు.ధరలు ఆకాశం కు తాకుతున్న మెస్స్ బిల్లు లు మాత్రం చాలా నామ మాత్రంగా ఉందని ప్రభుత్వం ఇచ్చే మెస్స్ బిల్లు ఏమాత్రం సరిపోదని,భవిష్యత్తు గల విద్యార్థులు ఆహరం పై నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమైన చర్య అని తక్షణమే నెలకు 3000 రూ.మెస్స్ బిల్లు లు పెంచాలని డిమాండ్ చేశారు.రాష్ట్రం లో ఎఫ్ ఆర్ ఎస్ అమలు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేసి పేద విద్యార్థుల స్కాలర్షిప్,ఫీజు రియాంబర్స్ మెంట్ లబ్ది దారుల సంఖ్య తగ్గించేందుకు తప్ప మరొకటి కాదని తక్షణమే ఇలాంటి విద్యార్థుల వ్యతిరేకంగా చేసే విధానాలు ను అడ్డుకుంటాం అని తెలిపారు.ఈ సమస్యలు పై కడప వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల దగ్గర వేలాది మంది విద్యార్థులతో నిరసన ధర్నా కార్యక్రమం జయప్రదం చేయాలనీ పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కడప నగర నాయకులు కార్తీక్,సిద్దు,భాస్కర్ నాయక్,హేమంత్ తదితరులు పాల్గొన్నారు