prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 12:16 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ పై మోకాళ్లపై అర్థనగ్న నిరసన చెసిన సిపిఐ నాయకులు

పోరుమామిళ్ల ప్రజావాణి న్యూస్) మోడీ సారు సామాన్య ప్రజల నెత్తిన గుది బండ మోపడం,సిగ్గుచేటు సిపిఐ ఆగ్రహం కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్,డీజిల్,వాణిజ్య,వంట గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని,సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్,సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్,వారి బృందం తో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో నిరసన తెలిపారుఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ పోరుమామిళ్ల సిపిఐ,ఏఐటియుసి మండల సమితి ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో నెత్తిపై గ్యాస్ సిలిండర్లు,పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలు మార్చుకోవాలని వారన్నారు.అలాగే,గ్యాస్ సిలిండర్లు,5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే నరేంద్రమోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు పెట్రో ధరల భారం కానుకగా ఇచ్చింది. ప్రతిసారీ ఎన్నికలకు ముందు ఒక మాట,ఎన్నికలు ముగియగానే మరో మాట మోడీ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది.ఎపీలో పెట్రోల్‌పై రూ.3.29లు,డీజిల్‌పై రూ.3.14లు,సిఎన్‌జి గ్యాస్ కిలో ధరపై రూ.2వేలు పెరిగాయి. ఇటీవలనే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.993 లు పెంచి ప్రజలపై గుదిబండ మోపింది. ఆయా ధరల భారం ప్రత్యక్షంగా ఒకపక్క,పరోక్షంగా మరోపక్క ప్రజలపై పడుతుంది.పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరల పెరుగుదల రవాణారంగంపై,ప్రయాణ ఖర్చులు మరింత భారమవుతాయి.నిత్యవసర వస్తువుల ధరలతోసహా పలు వస్తువుల ఆకాశాన్నంటుతాయి. అసలే అప్ప్పులు చేసి పంటలు సాగుచేస్తున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరమవుతుంది. రెక్కాడితేగాని డొక్కాడని పేదల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. ప్రజల ఆదాయం పెరగకుండా,ఖర్చు విపరీతమై అప్ప్పుల బాధలు వెన్నాడుతాయి.పెట్రో ఉత్పత్తులపై పన్నులు,సుంకాలు తగ్గించుకోవడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను వదలిపెట్టి, ప్రజలపై భారాలు మోపడమే లక్ష్యంగా మోడీ సర్కార్ పాలన సాగించడం విచారకరం.తక్షణమే పెంచిన పెట్రోల్ డీజిల్,సిఎన్‌జి గ్యాస్ ధరలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాం.అదేవిదంగా ఆటో కార్మికులు రోజురోజుకు ఆయిల్,ఇంజన్ స్పేర్ పార్ట్స్, ఇన్సూరెన్స్, ఎఫ్ సి,ఫైనాన్స్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం వలన ఆటోల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి కోడూరు కేశవ,ఏరియా కార్యవర్గ సభ్యులు జాకోబ్,ప్రసాద్,సఫా,పీరయ్య మండల నాయకులు చంద్ర, నరసింహులు,అన్వర్,గోపయ్య, అధిక సంఖ్యలో ఆటో కార్మికులు పాల్గొన్నారు,