పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేంతవరకు సీపీఐ పోరాటం సాగిస్తాం

ఘట్‌కేసర్, మే 16 (ప్రజావాణి): పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్ ఆర్‌జీకే కాలనీలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా సీపీఐ సీనియర్ నాయకులు కల్లూరు జయచంద్ర మాట్లాడుతూ, ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని, మెట్రో రైళ్లలో ప్రయాణించాలని సూచించారని తెలిపారు. అయితే వారం రోజులు గడవకముందే...