prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 3:41 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం 

నందిగామ ప్రజావాణి న్యూస్  శివారు అనాసాగరం గ్రామంలో మాగం బ్రహ్మ ఇంటి ప్రాంగణంలో శుక్రవారం ప్రభుత్వ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు, పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ ప్రభుత్వ హోమియో వైద్యలు దుర్గ మల్లేశ్వరరావు పలు రుగ్మతల సమస్యలకు వైద్య పరీక్ష నిర్వహించి ఉచితంగా హోమియో మందులు అందజేశారు, దీర్ఘకాలిక వ్యాధులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా హోమియో వైద్యం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చునని హోమియో వైద్యులు దుర్గ మల్లేశ్వరరావు పేర్కొన్నారు, గ్రామంలో ఉచిత హోమియోవైద్య శిబిరంలో వైద్య సేవలు అందించిన డాక్టర్ దుర్గమల్లేశ్వర రావు ను పూర్వ విద్యార్థులు నిమ్మగడ్డ రాజా భవిరిశెట్టి సత్యంబాబు గౌతమ్ ప్రభాకర్, మందుల నాగేశ్వరరావు మాగం బ్రహ్మములు శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు.ఈ వైద్య శిబిరంలో పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.