పూండి & పరిసర గ్రామాల సమస్యలపై ఎమ్మెల్యే గౌతు శిరీషమ్మకి వినతి పత్రం

వజ్రపుకొత్తూరు, 26 (ప్రజా వాణి): శ్రీకాకుళం జిల్లా, వజ్రపుకొత్తూరు మండలం, పూండి మరియు పరిసర
గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలపై రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు ఆధ్వర్యంలో గౌరవ శాసన సభ్యురాలు శ్రీమతి గౌతు శిరీషమ్మను కలిసి పూండి ప్రాంత ముఖ్య నాయకులు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకి పూర్తిగా వివరించారు.
ప్రధాన సమస్యలు:
1️⃣ పూండి రైల్వే స్టేషన్‌లో రైళ్ల హాల్ట్
భువనేశ్వర్ – సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్,
బరంపూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్,
పూరి – తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పూండి స్టేషన్‌లో హాల్ట్ ఏర్పాటు చేయాలి.
2️⃣ అల్తాడ – పూండి బెండిగేట్ డబుల్ రోడ్డు
జి.ఓ విడుదలైనప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
3️⃣ నౌపడ రోడ్ నుండి కొండూరు వరకు తారు రోడ్డు
ఉద్దానం కూర్మనాధపురం మీదుగా రహదారి నిర్మాణం చేపట్టాలి.
4️⃣ నౌపడ రోడ్ – లింగాలపాడు వయా అమలపాడు – మాడియావానిపేట వరకు తారు రోడ్డు
ఈ మార్గంలో తారు రహదారి ఏర్పాటు చేయాలి.
5️⃣ పూండి బస్ స్టాండ్ నుండి మంచినీళ్లపేట వరకు రహదారి అభివృద్ధి
ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కల్పించాలి.
ఎమ్మెల్యే గౌతు శిరీషమ్మ మాట్లాడుతూ త్వరలోనే ఈ సమస్యలకు తగిన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
మాజీ ఎంపీపీ గొరకల వసంత స్వామి,
వజ్రపుకొత్తూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కర్ని రమణ,
క్లస్టర్ ఇంచార్జ్ గోవింద, పాపారావు,
సీనియర్ నాయకులు దున్న షణ్ముఖరావు, చింత నారాయణ, అట్టాడ రఘు, కంబాల దానేష్, పిరియా శివప్రసాద్, గాది అఖిల్, తులే అప్పోజి, దుర్రు రాజారావు, కొనారి కిరణ్, మదనాల జోగారావు,
ఎంపి