పుష్కరాల నాటికి ఆలయాల అభివృద్ధి చేస్తాం మంత్రి అడ్లూరి
గోదావరి పుష్కరాల లోపే తీర ప్రాంత ఆలయాలకు కొత్త శోభ తీసుకువస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ముందుచూపుతో ఏడాది ముందే నిధులు కేటాయించారన్నారు. కోటిలింగాల ఆలయానికి ₹10 కోట్లు, పుష్కర ఘాట్‌కు ₹8 కోట్లు, రహదారుల విస్తరణకు నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. అనంతరం కుక్కకాటుతో మరణించిన మణితేజ కుటుంబానికి ₹5 లక్షల సీఎం సహాయనిధి చెక్కును అందజేసి, వెల్గటూర్‌లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్నారు.