పురుగుల మందు తాగి నవీన్ న్నుమూత
ప్రజావాణి,నెల్లికుదురు:పురుగుల మందు తాగి వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. నెల్లికుదురు ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నర్సింహుల గూడెం గ్రామానికి చెందిన సిద్దబోయిన నవీన్(30) డ్రైవర్ వృత్తితో కుటుంబంతో కలిసి జీవనం కొనసాగించేవాడు. కాగా తన భార్యతో కుటుంబ వ్యవహారాల్లో గొడవ జరిగింది. సంబంధిత గొడవ నేపథ్యంలో నవీన్ మనస్థాపానికి గురై క్షణికావేశంలో ఈనెల 26( ఆదివారం) సాయంత్రం వావిలాల గ్రామ స్టేజి సమీపంలో పురుగుల మందు తాగాడు.గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్రం మహబూబాబాద్ లోని ధరణి హాస్పిటల్ కు నవీన్ ను తరలించారు. చికిత్స పొందుతూ ఈనెల 27న( సోమవారం) సాయంత్రం మృతి ఎస్సై వెల్లడించారు. ఈ మేరకు మృతుని తండ్రి సిద్ధబోయిన నరసయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు.