పుట్లంపల్లి చెరువుకట్ట రోడ్డులో పెచ్చురిల్లుతున్న తాగుబోతుల ఆగడాలు.. రైతు బోరు బావి వద్ద ఒకే నెలలో 5 సార్లు వైర్ల దొంగతనం!
* పట్టించుకోని పోలీసులు.. ఆందోళనలో గ్రామస్థులు, మార్నింగ్ వాకర్స్ * తక్షణమే స్పందించి నిఘా పెంచాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి కడప జూన్27ప్రజావాణి నగర శివారులోని రిమ్స్ (RIMS) ఆసుపత్రి నుండి పుట్లంపల్లికి వెళ్లే చెరువుకట్ట రోడ్డు పక్కన గల వ్యవసాయ భూముల్లో దొంగల,తాగుబోతుల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. పుట్లంపల్లి గ్రామానికి చెందిన రైతు నాగిరెడ్డి రామిరెడ్డికి చెందిన వ్యవసాయ బోరు మోటార్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు ఒకే నెలలో ఐదుసార్లు దొంగిలించారు.వరుస దొంగతనాలతో సదరు రైతు తీవ్ర ఆర్థిక నష్టానికి గురై,సాగు నీరందక పంట...