prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 1:39 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పుట్టా మహేష్‌కుమార్ యాదవ్‌ను పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలి. సీపీఎం

ప్రజావాణిన్యూస్(మార్చి15)కడప నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్.హైదరాబాద్ శివారులోని ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఏలూరు ఎంపి పుట్టా మహేష్‌కుమార్ యాదవ్ పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు.ఆదివారం నాడు కడప నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయం నుండి విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన డిమాండ్ చేశారు.మహేష్‌కుమార్‌పై తెలుగుదేశం పార్టీ చర్య తీసుకొని డ్రగ్స్ నివారణలో తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలన్నారు.తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీలో మన రాష్ట్రానికి చెందిన ఎంపీ పట్టుబడడం ద్వారా రాజకీయ నాయకులకు,డ్రగ్స్ మాఫియాకు ఉన్న బంధం మరోసారి బహిర్గతమైందన్నారు,బాధ్యతాయుత ఎంపీ స్థానంలో ఉన్న పుట్టా మహేష్‌కుమార్ డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం ద్వారా తన పదవిని దుర్వినియోగం చేశాడని, తక్షణం ఆయన పార్లమెంటరీ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.డ్రగ్స్ నియంత్రిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం తమ పార్టీకి చెందిన ఎంపీ డ్రగ్స్ సేవించినట్లు తెలంగాణా పోలీసులు నిర్ధారించడంపై రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు.రాజకీయ నాయకుల మద్దతు లేకుండా డ్రగ్స్ వ్యాపారం,విస్తరణ జరగడం లేదని సీపీఎం మొదటి నుండీ చెబుతున్నదన్నారు.పుట్టా మహేష్‌కుమార్ సంఘటన కూడా దాన్నే రుజువు చేస్తున్నదన్నారు.ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న డ్రగ్స్ వ్యాపారులు,మద్దతు దారులను రాజకీయాల నుండి బహిష్కరించి తమ నిబద్దతను రుజువు చేసుకోవాలని డిమాండ్ చేశారు.