పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ పొత్కపల్లిలో సందడిగా ‘మాక్ పోలింగ్’

   ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రత్యక్ష అనుభవం పొందిన విద్యార్థులు  ఓటు హక్కు ప్రాధాన్యం, ఎన్నికల నిర్వహణపై సమగ్ర అవగాహన  పెద్దపల్లి ఆగస్టు 8 ప్రజావాణి : విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల వ్యవస్థపై అవగాహన పెంపొందించేందుకు మండల పరిధిలోని పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ పొత్కపల్లి పాఠశాలలో శనివారం ‘మాక్ పోలింగ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా ఓటు హక్కును వినియోగించుకోవడం, ఎన్నికల ప్రక్రియ తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో తెలుసుకునేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ వి. హరికృష్ణ...