prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 4:10 pm Digital Edition : VIJAYKUMAR SIDDIPET

పి ఎం ఎఫ్ ఎం ఈ పథకంపై కర్రోల్ల కవిత అవగాహన కార్యక్రమం..

సిద్దిపేట్ ఏప్రిల్ 15, ప్రజావాణి

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ పాములపర్తి విద్యానగర్ కాలనీలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పి ఎం ఎఫ్ ఎం ఈ ( ఎం ఎఫ్ ఎం ఈ- ప్రైమ్ మినిస్టర్ ఫార్మాలిసాషన్ అఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రిసెస్)పథకంపైప్రజల్లోఅవగాహనపెంచేందుకు స్థానిక నాయకురాలు కర్రోల్ల కవిత ఆధ్వర్యంలో ప్రత్యేకకార్యక్రమంనిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో కర్రోల్ల కవిత మాట్లాడుతూ, చిన్న స్థాయి ఆహార ప్రాసెసింగ్ వ్యాపారాలనుప్రోత్సహించడానికి ఈ పథకం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణప్రాంతాల్లో మహిళలు, యువత ఈ అవకాశాన్నివినియోగించుకుని స్వయం ఉపాధి పొందాలని ఆమె సూచించారు.పథకం ద్వారా వ్యాపారాలకు ఆర్థిక సహాయం, శిక్షణ, మార్కెటింగ్ సదుపాయాలు లభిస్తాయని ఆమె వివరించారు. దీనివల్ల స్థానిక ఉత్పత్తులకు మంచి మార్కెట్ దొరుకుతుందని పేర్కొన్నారు.ఈ సమావేశంలో పలువురు వ్యాపారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అధికారులు కూడా పథకం అమలువిధానంపైవివరణఇచ్చారు.కార్యక్రమంచివరలోలబ్ధిదారులకు దరఖాస్తు విధానం గురించి, డి ఆర్ డి ఏ ఏ పీ డి , సుధీర్, ఐ బి డి పి ఎం ప్రభాకర్, ఏపిఎం యాదగిరి, టి జి బి బ్యాంక్ మేనేజర్ మాతాజీ, సీసీ పద్మలత, వివో ఏ అక్కరం సంతోష, ఓబి మలుగు భాగ్యలక్ష్మి, గ్రామ సర్పంచ్ దుబ్బాసి భవాని, బాలకిషన్, పదో వార్డ్ మెంబర్ కొండనోళ్ళ లక్ష్మి, కొండనోల నరేష్ ఈ కార్యక్రమంలో అయ్యప్ప గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.