పిల్లవాగుపై విద్యుత్ వైర్లలో పిచ్చుకల గూళ్లు.. “ఆకట్టుకుంటున్న ప్రకృతి అందాలు”
బెజ్జంకి, జూన్ 1 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ల గ్రామంలోని పిల్లవాగు పైన ఉన్న విద్యుత్ వైర్లపై పిచ్చుకలు గూళ్లు నిర్మించుకోవడం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రకృతిలో భాగమైన పిచ్చుకలు తమ నివాసంగా విద్యుత్ వైర్లను ఎంచుకుని గూళ్లు కట్టుకోవడం అరుదైన దృశ్యంగా మారింది.నేటి ఆధునిక జీవనశైలిలో పిచ్చుకల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో గుగ్గిళ్ల గ్రామంలో ఈ పక్షులు గూళ్లు నిర్మించుకోవడం పర్యావరణ ప్రేమికులను ఆనందపరుస్తోంది.పిల్లవాగు పరిసర ప్రాంతాల్లో ఆహారం, అనుకూల వాతావరణం ఉండటంతో పిచ్చుకలు ఇక్కడ...