prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 8:20 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పిట్టు,సింగారెడ్డి కళ్యాణ వేడుకల్లో.మోపూరి వారి పుట్టు వెంట్రుకల వేడుకల్లో రెడ్యo దంపతులు.

ప్రజావాణి న్యూస్:(మార్చి 08) .ఖాజీపేట మండలం, రావులపల్లె పంచాయతీ, గోపాలపురం (పాటిమీద పల్లె) కు చెందిన శ్రీమతి పిట్టు అమరావతి కనిష్ట పుత్రుడు చి||గంగరాజు యాదవ్, చి||ల||సౌ||గంగా మల్లేశ్వరి కళ్యాణ వేడుక వరుని స్వగృహం పాటిమీద పల్లె లో జరిగింది.కడప నగరానికి చెందిన శ్రీమతి సింగారెడ్డి సుజాత రెడ్డెమ్మ, సింగారెడ్డి రామచంద్రారెడ్డి ఏకైక పుత్రిక చి||ల||సౌ||డా||విజ్ఞత, చి||డా||సాయి మనోజ్ కుమార్ ల కళ్యాణం కడప నగర పరిధిలోని మాధవి కన్వెన్షన్ లో జరిగింది. కడప నగరానికి చెందిన మోపూరి రామకృష్ణారెడ్డి-శ్రీమతి దేవీల మనవడు, మనవరాలు చైతన్య శివారెడ్డి, హిరణ్యల పుట్టు వెంట్రుకల వేడుక వేకువజామున ప్రొద్దుటూరు రామేశ్వరంలోని శ్రీ మునిస్వామి ఆలయంలో జరిగింది. అనంతరం విందు కడప నగరంలోని మహాలక్ష్మి కన్వెన్షన్ సెంటర్లో మధ్యాహ్నం జరిగింది.పై కళ్యాణ, పుట్టు వెంట్రుకల వేడుకల్లో వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యo వెంకటసుబ్బారెడ్డి, ఆయన సతీమణి శ్రీమతి రెడ్యo లక్ష్మీ ప్రసన్న, వైయస్సార్ సిపి నేత, కేసీ కెనాల్ ప్రాజెక్ట్ మాజీ వైస్ చైర్మన్ రెడ్యం చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి శ్రీమతి రెడ్యం అరుణా దేవిలు పాల్గొని నూతన వధూవరులను, చిరంజీవులను ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, నిండు నూరేళ్లు జీవించాలని రెడ్యo దంపతులు అక్షింతలు చల్లి దీవెనలు అందించారు