prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 1:55 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పాలేటి గంగమ్మ తల్లి తిరునాళ్ళకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

ప్రకాశం జిల్లా ప్రజావాణి న్యూస్ (మే04 ) పెద అలవలపాడు పంచాయతీలోని వెంగళాపురం గ్రామం లోని దేవాలయము వద్ద భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీతిరునాళ్ళు సమయంలో దొంగతనాలు,అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక నిఘా:జిల్లా ఎస్పీ,ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు పెద్ద చెర్లోపల్లి మండలం,పెద అలవలపాడు పంచాయతీలోని వెంగళాపురం గ్రామం లోని తేదీ:05.05.2026 న శ్రీ పాలేటి గంగమ్మ తల్లి తిరునాళ్లు నేపధ్యంలో సోమవారం జిల్లా ఎస్పీ,అక్కడి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.దేవాలయ ప్రాంగణ పరిసరాలు,ప్రవేశ మార్గములు,క్యూలైన్లు, పార్కింగ్‌ స్థలాలు,ప్రభలు ఉంచే ప్రదేశాలు,ఎద్దుల పందాలు జరిగే ప్రదేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు,ఎగ్జిబిషన్ జరిగే ప్రదేశాల వద్ద భద్రతా మరియు బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు,ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని,ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధమైన క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని,తిరునాళ్ళు ప్రశాంత వాతావరంలో జరిగేలా దేవాదాయ,రెవిన్యూ అధికారుల సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఎస్పీ,ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ,మాట్లాడుతూ ఈ తిరునాళ్ళు ప్రశాంతంగా నిర్వహించేందుకు సిబ్బందితో పకడ్భందీగా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని,పూర్తి స్ధాయి బందోబస్తుతో అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపడుతామని తెలిపారు.శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా భద్రతా చర్యలపై పోలీసు అధికారులు మరియు ఆలయ పెద్దలతో మాట్లాడమని,తిరునాళ్ళు జరిగే ప్రాంతంలో దొంగతనలు అసాంఘిక చర్యలకు తావు లేకుండా ప్రత్యేక నిఘా, సీసీ కెమెరాలు,డ్రోన్ కెమెరాలతో కూడా నిఘా ఉంచామని,ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామని,ఏదైనా అవాంఛనీయ సంఘటనల గురించి వెంటనే సమాచారం డయల్ 112 తెలియచేయాలన్నారు.భక్తులు,ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు గురించి,ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా,ఎక్కడ ఎలాంటి అనుకోని సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. భక్తులు, ప్రజలు తోపులాటలు లేకుండా తిరునాళ్ళు ఘనంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు.అనంతరం ఎస్పీ గారు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.జిల్లా ఎస్పీవెంట యస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు,కనిగిరి సీఐ యు.శ్రీనివాసులు,పీసీ పల్లి ఎస్సై నరసింహారావు,కనిగిరి ఎస్సై సందీప్,హెచ్ ఎం పాడు ఎస్సై రాజ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు మరియు తదితరులు ఉన్నారు