పాలకీడులో ఇన్స్ట్రక్టర్లు, ఆయాలకు నియామక పత్రాల అందజేత.
ఫ్రీ ప్రైమరీ విద్య బలోపేతానికి ప్రభుత్వం మరో కీలక అడుగు.
మఠంపల్లి జూలై 27 (ప్రజావాణి)
సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని ఎంపీపీఎస్ పాలకీడు, జాన్‌పహాడ్, సూన్యపహాడ్ పాఠశాలలకు ఫ్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణ కోసం ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టులను మంజూరు చేశారు. జాన్‌పహాడ్ పాఠశాలలో ఎంపికైన ఇన్స్ట్రక్టర్ చలవాది అరుణ, ఆయా కోడబోయిన భవానిలకు గ్రామ సర్పంచ్ కేలావత్ కవిత కిరణ్, ప్రధానోపాధ్యాయులు సీహెచ్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్.వి. సుబ్బారావు, మాజీ ఎంపీపీ భూక్య గోపాల్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాలోతు మోతిలాల్ నాయక్, ఉపాధ్యాయులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.