ప్రజావాణి న్యూస్(మార్చి31) దువ్వూరు మండలం స్వామి శ్రీ వివేకానంద సూక్తులు పుస్తకాన్ని ఎంపీకి బహుకరించిన రెడ్యo.నిరంతర కృషీ వలుడు,ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాటం చేసే యోధుడు కడప పార్లమెంట్ సభ్యుడు వైయస్ అవినాష్ రెడ్డిని పార్లమెంట్ ఎస్టిమేషన్ కమిటీ సభ్యుడిగా కీలక పదవికి ఎంపిక చేశారు.ఆ మేరకు సోమవారం సాయంత్రం పార్లమెంట్ లో బులిటెన్ విడుదల చేశారు.పార్లమెంటు ద్వారా అభివృద్ధి కోసం చేసే ఖర్చు,వ్యయాల వివరాలను ఎంపీ అవినాష్ పరిశీలిస్తారు.ఆ మేరకు.పార్లమెంట్ ఎస్టిమేషన్ కమిటీ సభ్యుడుగా ఎన్నికైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని దువ్వూరు మండలం,చల్లబసాయ పల్లెలో మంగళవారం ఉదయం వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి,కమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యo వెంకటసుబ్బారెడ్డి,వైఎస్ఆర్సిపి నేత,కేసీ కెనాల్ ప్రాజెక్ట్ మాజీ వైస్ చైర్మన్ రెడ్యo చంద్ర శేఖర్ రెడ్డి లు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పట్టు కండువాతో ఘనంగా సన్మానించారు.అనంతరం స్వామి శ్రీ వివేకానంద సూక్తులు పుస్తకాన్ని రెడ్యo బహుకరించారు.పుస్తకాన్ని మీరు రోజు 3,4 సూక్తులు చదవాలని రెడ్యo కోరగా తప్పక చదువుతానని ఎంపీ అవినాష్ తెలిపారు.ఈ సందర్భంగా రెడ్యo మాట్లాడుతూ.ఈ పదవి అవినాష్ కు వన్నె కాదని,అవినాష్ నే పదవికి వన్నె అని,ఈ పదవికి అవినాష్ సంపూర్ణంగా న్యాయం చేస్తారని రెడ్యo కొనియాడారు.ఈ కార్యక్రమంలో మైదుకూరు మాజీ శాసనసభ్యుడు, వైఎస్ఆర్సిపి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శెట్టిపల్లి రఘురామిరెడ్డి,ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సిపి బీసీ సెల్ అధ్యక్షుడు రమేష్ యాదవ్ లు పాల్గొన్నారు.