పారిశుధ్యం, డ్రైనేజీ,నీటి సరఫరా మెరుగుదలకు కమీషనర్ సూచనలు.

గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే04) మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక పారిశుధ్య మరియు త్రాగునీటి సమస్యల పరిష్కారంలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ అలీం భాషా సోమవారం పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి పరిస్థితులను సమీక్షించారు.మంగళగిరి పట్టణంలోని షరాఫ్ బజార్,మార్కండేయ కాలనీలలో రోడ్ల పరిస్థితి,మురుగు కాలువల పారుదల సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా డ్రైనేజీలలో ప్లాస్టిక్ కవర్లు,చెత్త వేయడం వల్ల కాలువలు మూసుకుపోతున్నాయని గుర్తించి,ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ కవర్లు లేదా చెత్తను మురుగు కాలువల్లో వేయరాదని సూచించారు.ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని,పరిశుభ్రతను...