పారదర్శకమైన ఓటరు జాబితా సిద్ధం చేయాలి – డిప్యూటీ కమిషనర్ శ్రీమతి వాణి

ఘట్కేసర్, ఏప్రిల్ 24 (ప్రజావాణి). ఘట్కేసర్ సర్కిల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శ్రీమతి వాణి, తహసీల్దార్ శ్రీ చంద్రశేఖర్ పాల్గొని సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమం అమలు పురోగతి, ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన మరియు ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాల తొలగింపు, డూప్లికేట్ నమోదుల గుర్తింపు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా...