prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 3:29 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పాయకాపురం, ప్రశాంతినగర్ లో 10వ తరగతి విద్యార్థుల ప్రతిభ అవా ర్డ్స్

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 10) విజయవాడలో ఈ  రోజు స్పందన సేవాసమితి ఆధ్వర్యంలో పాయకాపురం, ప్రశాంతినగర్ లో ఉన్న స్పందన ఆఫీసు నందు “10 వ తరగతి విద్యార్థుల ప్రతిభ అవా ర్డ్స్” కార్యక్రమం ఘనంగా జరపడం జరిగినది. 6 మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్స్ లో జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనపరచిన 25 మంది విద్యార్థులకు 40,000 రూపాయల నగదు పారితోషికాలు, మేమెంటోలు మరియు సర్టిఫికెట్లతో అభినందించడం జరిగినది.ముఖ్య అతిథులుగా వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 202 పాస్ట్ గవర్నర్ MRS. ప్రకాశరావు గారు, లయన్స్ క్లబ్ ఆఫ్ 316D రీజనల్ చైర్మన్ . యక్కటి సుధాకర్ బాబు ,గౌరవ అతిధులుగా నాంచారయ్య గారు,1265 పేజీల భరత వర్ష రచయిత, బహుభాషా కోవిదులు, పూలబాల వెంకట్ గారు,డాక్టర్ బ్రహ్మదేశం సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు DR. బ్రహ్మదేశం వసంత కుమార్ గారు పాల్గొనినారు.