పాములపర్తి విద్యానగర్ అంగన్వాడీ 1కేంద్రంలో అన్నప్రాసన, శ్రీమంతాలు కార్యక్రమం..

సిద్దిపేట జిల్లా, మార్చి 11, ప్రజావాణి సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ పాములపర్తి విద్యానగర్ అంగన్వాడీ 1వ కేంద్రంలో బుధవారం అన్నప్రాసన, శ్రీమంతాలు, కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ భావని, బాలకిషన్, ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు ఆశీస్సులు అందజేశారు. ఉపసర్పంచ్ జుట్టు సుధాకర్, పాల్గొని గర్భిణీ స్త్రీలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వార్డ్ సభ్యులు నీరుడి రాజు, కొండని లక్ష్మి, దండు కరుణాకర్, కొండని నరేష్,మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు....