prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 7:36 am Digital Edition : RAJU CHELUKAPALLY CHENNARAOPET

పాపయ్యపేట అభివృద్ధికి బాటలు: గ్రామసభ నిర్ణయం

పాపయ్యపేట అభివృద్ధికి బాటలు: గ్రామసభ నిర్ణయం

జలసిరి’ కార్యక్రమంపై గ్రామస్థులకు అవగాహన

చెన్నారావుపేట జూలై 29 ప్రజావాణి

మండల కేంద్రంలోని పాపయ్యపేట గ్రామ పంచాయతీ ప్రాంగణంలో బుధవారం సర్పంచ్ బుర్ర సుదర్శన్ గౌడ్ అధ్యక్షతన గ్రామసభ ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఊరి ప్రగతియే ధ్యేయంగా విలేజ్ వాటర్ అండ్ పారిశుద్ధ్య కమిటీ (విడబ్ల్యుఎస్ సి) జీవ వైవిధ్య కమిటీలను ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘జలసిరి’ కార్యక్రమంపై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తూ, పరిసరాల పరిశుభ్రత, నీటి బొట్టును సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను సర్పంచ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లింగాల సారంగం, వార్డు సభ్యుడు గుర్రం రవి, పంచాయతీ సెక్రెటరీ రాజు,అలువాల శ్రీనివాస్, మేడి సంతోష్,ఆశా వర్కర్ సాలమ్మ,అనిత, రజిత, అరుణ, పుష్పలత, జ్యోతి తదితరులు పాల్గొని గ్రామసభను జయప్రదం చేశారు.