పాపయ్యపల్లి అంగన్వాడీలో ఘనంగా తల్లి పాల వారోత్సవాలు

బెజ్జంకి, ఆగస్టు 4 (ప్రజావాణి) తల్లి పాల వారోత్సవాల సందర్భంగా మంగళవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పాపయ్యపల్లి అంగన్వాడీ కేంద్రంలో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్    మాట్లాడుతూ, పుట్టిన వెంటనే శిశువుకు ముర్రిపాలు తప్పనిసరిగా అందించాలని, ముర్రిపాలలో సమృద్ధిగా ఉండే పోషకాలు శిశువు ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయని తెలిపారు.అనంతరం అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు యూనిఫాంలు, కోడిగుడ్లు, బాలామృతం పంపిణీ చేశారు. అలాగే తల్లి పాల ప్రాముఖ్యతపై గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలకు...