పాత కడప హరిజనవాడలో ప్రధాన డ్రైనేజీ కాలువ ఏర్పాటు చేయండి. సి.పి.ఎం

ప్రజావాణిన్యూస్(మార్చి16)కడపనగరం ఒకటో డివిజన్ పాత కడప హరిజనవాడలో చిన్న చిన్న కాలువలన్నీ కలిపి వెళ్ళే ప్రధాన డ్రైనేజీ కాలువను తక్షణమే ఏర్పాటు చేయాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు.సోమవారం నాడు కడప నగర పాలక సంస్థ గ్రీవెన్స్ డే లో డిప్యూటీ కమిషనర్ రాంబాబుకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా రామమోహన్ మాట్లాడుతూ పాత కడప హరిజనవాడ ఏర్పడి చాలా సంవత్సరాలు అయిందని,ఇప్పటివరకు ప్రధాన డ్రైనేజ్ కాలువ ఏర్పాటు చేయడం లేదన్నారు.ప్రధాన డ్రైనేజీ కాలువ ఏర్పాటు చేయకపోవడం వల్ల మురుగునీరు అంతా...