పాడి రైతుల పిల్లలకు కరీంనగర్ పాల డెయిరీ స్కాలర్‌షిప్‌లు
బెజ్జంకి, జూలై 13 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన కరీంనగర్ పాల డెయిరీకి పాలు సరఫరా చేస్తున్న పాడి రైతుల కుటుంబాల విద్యార్థులకు కరీంనగర్ డైరీ చేర్మెన్ ఆదేశాల మేరకు పాల స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేశారు. విద్యార్థులను ప్రోత్సహించి ఉన్నత విద్యకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కరీంనగర్ పాల డెయిరీ సూపర్‌వైజర్ కేడిక మాధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, పాడి రైతుల పిల్లలు విద్యలో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని...