పాఠశాల పై వినతిపత్రం అందజేసిన ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయురాలు….ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తాం

ఘట్‌కేసర్, జూలై 16:  ఘట్‌కేసర్ మండల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రధానోపాధ్యాయురాలు కె. అఖిల, ఉపాధ్యాయురాలు సుధారాణి పోచారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రె రాజేష్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, పాఠశాల భవనానికి రంగులు వేయించడం, విద్యార్థులకు బెంచీలు ఏర్పాటు చేయడం, పాఠశాల చుట్టూ ఉన్న ప్రహరీ గోడను మరమ్మతు చేయించడం అత్యవసరమని వివరించారు. వినతిపత్రాన్ని స్వీకరించిన కర్రె రాజేష్ పాఠశాలను సందర్శించి...