పాఠశాల అభివృద్ధికి అండగా వార్డు సభ్యుడు మైలారం బాబు
రామాయంపేట, జులై 21
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, కాట్రి యాల్ కు నేమ్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరిన వెంటనే సానుకూలంగా స్పందించి, ఆలస్యం చేయకుండా నేమ్బర్డు ఏర్పాటు చేయించిన వార్డు సభ్యుడు శ్రీ మైలారం బాబు గారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కవిత,ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు హృదయపూ
ర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పట్ల చూపుతున్న చొరవ, విద్యార్థుల పట్ల బాధ్యతాయుతమైన వైఖరి అభినందనీయమని కొనియాడారు. పాఠశాల అవసరాలను గుర్తించి వెంటనే స్పందించడం సేవాభావానికి నిదర్శనమ ని పేర్కొన్నారు. ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాల్లో సహకారం భవిష్యత్తులో కూడా కొనసాగి,ప్రభు త్వ పాఠశాలల అభివృద్ధికి మరింత తోడ్పాటు అం దించాలని పాఠశాల ఉపాధ్యాయులు కోరారు