prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 11:27 am Digital Edition : MEERASAHAB CHILUKUR

పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

కోదాడ మార్చి10(ప్రజావాణి):కోదాడ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదోతరగతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని పంపిణీ చేసి, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.అనంతరం పాఠశాల పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు.