పాండ్యతండాలో వేడుకగా తల్లిపాల వారోత్సవాలు
పాండ్యతండాలో వేడుకగా తల్లిపాల వారోత్సవాలు చెన్నారావుపేట ఆగస్టు 4 ప్రజావాణి పసిపాపలకు తల్లిపాలే అమృతం అని, అవి పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయని సర్పంచ్ మహబూబ్ సింగ్ పేర్కొన్నారు.మండలంలోని చెరువుకొమ్ముతండా పరిధి పాండ్యతండా అంగన్వాడీ కేంద్రంలో టీచర్ రాణి నిర్వహించిన అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు వేడుకగా సాగాయి. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న సర్పంచ్ మాట్లాడుతూ.. బాటిల్ పాలకు దూరంగా ఉంటూ, మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే పడితే శిశువులకు పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు. తల్లిపాల్లోని సహజ పోషకాలు వ్యాధి...