పసర గ్రామంలో నాసిరకం రోడ్ల పనులు – ప్రజలు అవస్థలు

పసర గ్రామంలో నాసిరకం రోడ్ల పనులు - ప్రజలు అవస్థలు .సాంక్షన్ అయిన రోడ్లపై మట్టి పోసి చేతులు దులుపుకుంటున్నారా? గోవిందరావుపేట, జూలై 25:-ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పసర గ్రామంలో సాంక్షన్ అయిన రోడ్ల పనుల్లో నాసిరకం మట్టిని వినియోగిస్తుండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గ్రామంలోని ప్రధాన రహదారులు మరియు లోపలి వీధులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ, కాంట్రాక్టర్ సంబంధిత అధికారులతో కుమ్మక్కై నాణ్యత లేని ఎర్ర మట్టితో పనులు పూర్తి చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షం పడితే రోడ్లన్నీ బురదమయంగా...