పశువుల పొట్టలో..కల్తీ..చిచ్చు.. ప్రొద్దుటూరు ఎస్టేట్‌లో మృత్యువ్యాపారం

కడప జిల్లా ప్రజావాణిన్యూస్(ఏప్రిల్07)ప్రొద్దుటూరు పశువుల పొట్టలో.కల్తీ.చిచ్చు.ప్రొద్దుటూరు ఎస్టేట్‌లో మృత్యువ్యాపారం.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారూ.మూగజీవాల.మరణ శాసనాన్ని.ఆపండి.రాయలసీమ గడ్డ మీద మంచితనానికి ఎంత విలువుందో,మోసానికి అంత శిక్ష ఉండాలి.కానీ,ప్రొద్దుటూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ సాక్షిగా చట్టం చచ్చి పడిందా.అన్న అనుమానం కలుగుతోంది.చట్టానికి కళ్ళు లేవు.న్యాయానికి ఇల్లు లేదు అన్న సామెతను ఇక్కడి కల్తీ వ్యాపారులు అక్షరాలా నిజం చేస్తున్నారు.నోరు లేని మూగజీవాలను పొట్టనబెట్టుకుంటూ,రక్తం తాగే రాక్షసుల్లా తయారయ్యారు కొందరు కేటుగాళ్ళు.తౌడు కాదు.అది మృత్యు పిండి.రైతుకు కన్నబిడ్డలాంటి పశువులకు పెట్టే తౌడులో విషం కలుపుతున్నారు.కేవలం కాసుల కక్కుర్తి కోసం...