prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 9:41 am Digital Edition : RAJASHEKARREDDY

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన – గ్రామ సర్పంచ్ ఎర్రల జానకి -రాజు

బెజ్జంకి , జూన్ 28 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని సర్పంచ్ ఎర్రల జానకి రాజు ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలియో చుక్కలు వేస్తారని ప్రతి ఒక్క తల్లీదండ్రులు 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, గతంలో వేయించినా మరోసారి వేయించడం అవసరమని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో రహిత గాగిల్లాపూర్ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతలపల్లి పద్మ, వార్డు సభ్యులు, ఆశా వర్కర్ పులి తృతీయవర్ణ, అంగన్‌వాడీ టీచర్ శారద, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.