పలు కుటుంబాలను పరామర్శించిన తొట్ల తిరుపతి యాదవ్
రామగిరి,మన సమగ్ర ప్రజావాణి జూలై 24
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, బలోపేతం కోసం నిరంతరం కృషి చేసిన సీనియర్ నాయకుడు చెరుకు నారాయణ సేవలు మరువలేనివని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ అన్నారు.రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా తొట్ల తిరుపతి యాదవ్,రామగిరి మండల మాజీ ఎంపీపీ అరేల్లి దేవక్కా కొమురయ్య గౌడ్ లు మాట్లాడుతూ… చెరుకు నారాయణ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా నిస్వార్థంగా పనిచేస్తూ కార్యకర్తలకు అండగా నిలిచారని కొనియాడారు. పార్టీ బలోపేతం,ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చేసిన సేవలు కాంగ్రెస్ శ్రేణులకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల కోసం నిరంతరం పనిచేసిన చెరుకు నారాయణ,మల్లారపు శంకర్ తండ్రి వంటి నాయకుల సేవలను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి,ఉప సర్పంచ్ జనగామ సదానందం,లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ చైర్మెన్ కోర కొప్పుల సత్యనారాయణ గౌడ్,గ్రామ అధ్యక్షుడు గర్రేపల్లి ప్రవీణ్ గౌడ్,తాజా మాజీ ఎంపీటీసీ జనగామ హేమలత బుచ్చి బాబు,వార్డు సభ్యుడు రామగిరి స్టాలిన్,దేవాలయ కమిటీ సభ్యుడు రేకుంట్ల రవి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు జనగామ కృష్ణస్వామి,కోర కొప్పుల తిరుపతి గౌడ్,కోర కొప్పుల లక్ష్మణ్,మర్కా స్వామి, కోర కొప్పుల మణికంఠ గౌడ్,గడ్డం నాగరాజు,ఆర్ల సాయి,కార్యకర్తలు,గ్రామ పెద్దలు,అభిమానులు పాల్గొని చెరుకు నారాయణ సేవలను స్మరించుకున్నారు.

