prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 2:55 pm Digital Edition : VIJAYKUMAR SIDDIPET

పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ గూర్చి తహశీల్దార్లు, ఎంపిడిఓ, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ ఏఈ లతో జిల్లా కలెక్టర్ కె హైమావతి సమీక్ష..

 

సిద్దిపేట్, ఏప్రిల్ 7, ప్రజావాణి

సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ గూర్చి తహశీల్దార్లు, ఎంపిడిఓ, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ ఏఈ లతో జిల్లా కలెక్టర్ కె హైమావతి సమీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈ డి విజయ్ భార్గవ్, గృహ నిర్మాణ శాఖ పిడి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ రుణాల ప్రణాళికలో భాగంగా అప్లై చేసుకున్న దరఖాస్తులను ఆధారంగా మండలానికి కేటాయించిన యూనిట్లకు లబ్ధిదారులను ఫీల్డ్ వెరిఫై చేసి అర్హులైన వారికి నిర్ధిష్ట సమయంలో లబ్ధిదారులకు అందజేయాలని ఏంపిడిఓ లను ఆదేశించారు. పాలు ఇచ్చే జంతువులు, సోలార్ యూనివర్సల్ యూనిట్ల అధిక ప్రాధాన్యత సబ్సిడీ ఉన్నందున ఏ ఒక్క యూనిట్ కూడా మిగలకుండా గ్రౌండింగ్ చేయించాలి.రుణాల గ్రౌండింగ్ లో మండల స్థాయిలో కమిటీ ఆమోదయోగ్యం చేశాక జిల్లా స్థాయి కమిటీలో చర్చించి అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశించారు.ఎస్ బి ఎం గ్రామీణ్ పథకం లో గృహ నిర్మాణాలలో ఉపాధి అవకాశం కోసం సెట్రింగ్, ఇటుకల తయారీ మంజూరైన యూనిట్లకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చెయ్యాలని ఆదేశించారు.ఐఎచ్ఎచ్ పథకంలో ఇందిరమ్మ ఇళ్లకు 12,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ అందజేస్తుందనీ 519 యూనిట్లకు మాత్రమే గ్రౌండింగ్ చేశారని 2 రోజుల్లో మిగతా యూనిట్లు గ్రౌండింగ్ చేయించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో కూలీల శాతం తప్పనిసరిగా పెంచాలని ప్రతి రోజు ఒక గ్రామం ఉపాధి హామీ పథకం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఎంపిడిఓ లను ఆదేశించారు.సెన్సెస్ – 2026 గృహ గణనకు సంబంధించి బ్లాక్ క్రియేట్ ప్రక్రియ ఏప్రిల్ 13 వరకు పూర్తి చెయ్యాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.మండలాల్లో నిర్వహించే సివిల్ రైడ్స్ డే కార్యక్రమంలో తప్పనిసరిగా మండల స్థాయి అధికారులు హాజరు కావాలని ఆదేశించారు.ఇందిరమ్మ ఇండ్ల పురోగతిలో మన జిల్లా గ్రౌండింగ్ లో ముందువరుసలో ఉందని గ్రౌండింగ్ అయిన ప్రతి ఇల్లు పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. మార్కింగ్ ఇచ్చి ఇంటి పనులు మొదలు పెట్టని లబ్దిదారులతో గ్రామాల వారిగా సమావేశాలు నిర్వహించి వారితో ఇల్లు మొదలు పెట్టించి నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు.గ్రౌండింగ్ అయిన నిర్మాణాలు బేస్మెంట్, గోడలు, స్లాబ్, ప్లాస్టింగ్ స్థాయిలో మండలాల్లో నిర్మాణాలను తరచూ పర్యవేక్షణ చెయ్యాలని ఎలాంటి సమస్యలు ఎదురైన ఎంపీడీఓ ల వద్దకు వెళ్లి పరిష్కరించుకోవాలని హౌసింగ్ ఏఈ లను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా స్లాబ్ స్థాయిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి మండల స్థాయిలో ఏప్రిల్ 16 తేదీన మండల సభ నిర్వహణ రోజు వివరించాలని, ఏప్రిల్ 30 వరకు ఒక లక్ష్యం పెట్టుకొని గృహ నిర్మాణాలు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఆయా స్థాయిలో పూర్తి కాగానే ఏఈ వెంటనే పర్యవేక్షణ చేసి పోటో క్యాప్చర్ చెయ్యాలని తెలిపారు. పే మెంట్ వివరాలు సైతం ఎల్లపుడు అప్డేట్ చేసుకోవాలని తెలిపారు.వేసవి కాలం కావున నిర్మాణానికి మంచి సమయం కావున అందరూ అధికారులు సమన్వయంతో పనిచేసి ఇందిరమ్మ ఇండ్ల పూర్తి చేయించాలని తెలిపారు. మున్సిపాలిటీల్లో గృహ నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ లను ఆదేశించారు.జిల్లాలో పూర్తయి లబ్ది దారులకు అందించిన రెండు పడక గదులు లబ్ధిదారుల వివరాలతో పూర్తి సమాచారాన్ని ఆన్లైన్ లో అప్లోడ్ చెయ్యాలని తెలిపారు. కొంత మంది అక్రమంగా ఉంటున్న రెండు పడక గదుల ఇండ్లలో వారి వివరాలను ఫీల్డ్ విసిట్ చేసి నిజమైన అర్హులైతేనే వారికి ఇల్లు కేటాయించాలని అర్హులు కాకపోతే ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు..