పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత పన్నూర్ సర్పంచ్ చిందం మహేష్
రామగిరి మండలంలో ఘనంగా వన మహోత్సవం.. ఉచితంగా మొక్కల పంపిణీ గ్రామాన్ని 'హరితవనం'గా తీర్చిదిద్దడమే లక్ష్యం పెద్దపల్లి (పన్నూర్) జూలై 28 ప్రజావాణి : పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైనా ఉందని, పచ్చదనంతోనే మానవ మనుగడ సాధ్యమని పన్నూర్ గ్రామ సర్పంచ్ చిందం మహేష్ స్పష్టం చేశారు. రామగిరి మండలం పన్నూర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామస్తులకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి కుటుంబం ఒక మొక్కను నాటాలి:...