పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు చెట్లు నాటాలి-ఏబీవీపీ
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పోరుమామిళ్ల (ప్రజావాణి జులై 07) శాఖ ఆధ్వర్యంలో జులై 9వ తేదీన ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పోరుమామిళ్ల లోని గోవర్నమెంట్ డిగ్రీ కళాశాల దగ్గర కళాశాల ప్రిన్సిపాల్ శామ్యూల్ డేవిడ్ చేతుల మీదుగా చెట్లను నాటడం జరిగింది.ఈ సందర్భంగా గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శామ్యూల్ డేవిడ్మా ట్లాడుతూ.విద్యార్థుల్లో జాతీయ భావాన్ని, సామాజిక స్పృహను పెంపొందించడంలో ఏబీవీపీ ముందుంటుందని కొనియాడారు.కేవలం విద్యార్థుల సమస్యలపై పోరాటాలకే పరిమితం కాకుండా,సమాజ సేవలోనూ, పర్యావరణ పరిరక్షణ వంటి...