prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 4:39 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు చెట్లు నాటాలి-ఏబీవీపీ

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పోరుమామిళ్ల (ప్రజావాణి జులై 07) శాఖ ఆధ్వర్యంలో జులై 9వ తేదీన ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పోరుమామిళ్ల లోని గోవర్నమెంట్ డిగ్రీ కళాశాల దగ్గర కళాశాల ప్రిన్సిపాల్ శామ్యూల్ డేవిడ్ చేతుల మీదుగా చెట్లను నాటడం జరిగింది.ఈ సందర్భంగా గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శామ్యూల్ డేవిడ్మా ట్లాడుతూ.విద్యార్థుల్లో జాతీయ భావాన్ని, సామాజిక స్పృహను పెంపొందించడంలో ఏబీవీపీ ముందుంటుందని కొనియాడారు.కేవలం విద్యార్థుల సమస్యలపై పోరాటాలకే పరిమితం కాకుండా,సమాజ సేవలోనూ, పర్యావరణ పరిరక్షణ వంటి బృహత్తర కార్యక్రమాల్లోనూ ఏబీవీపీ చురుగ్గా పాల్గొనడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న కాలుష్య నివారణకు, భావితరాల భవిష్యత్తుకు పర్యావరణ పరిరక్షణ ఎంతో అవసరమని, అందుకోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ అభిలాష్,చంద్ర,హర్ష,కార్తీక్,చందు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.