prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 7:40 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సు

*పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సు*

*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపడుతున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక (99 Days Action Plan) “పర్యావరణ వారోత్సవము” కార్యక్రమము లో భాగంగా తేది: 04.06.2026, 06.06.2026, 08.06.2026 మరియు10.06.2026 రోజులలో వార్డు సభలను నిర్వహించాల్సి ఉండగా దానిలో భాగంగా మొదటి వార్డు సభ సమావేశము గురువారం తేది: 04.06.2026 న ఉదయం: 10:00 గంటలకు స్థానిక పి ఆర్ గెస్ట్ హౌస్ నందు శ్రీయుత గౌరవ చైర్ పర్సన్ డా. కోడి శ్రీనివాసులు, 10 వ వార్డు కౌన్సిలర్ కటకం రమేష్, 6 వ వార్డు వార్డు ఆఫీసర్ ఏ. జగన్, 10 వార్డు వార్డు ఆఫీసర్ జి. శ్రీరాములు అద్వర్యంలో వార్డు సభలు నిర్వహించడం జరిగింది. చైర్ పర్సన్ డా. కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ పర్యావరణ, పారిశుద్యం, పరిశుభ్రత, ఇంకుడు గుంతలు ఏర్పాటు గురించి ప్రసంగించారు. రాబోవు వర్షాకాలం సన్నద్దతలో భాగంగా శిధిలావస్థలో ఉన్న ఇండ్ల తొలగింపు, రోడ్ల వెంట నీరు నిల్వ ఉండకుండా, కంపచెట్ల తొలగింపు, మురికి కాలువలు పూడిక తొలగింపు గురించి, రాబోవు వర్షాకాలంలో వర్షస్థాయి తక్కువగా నమోదు అవుతుంది అని పర్యావరణ శాస్త్రవేత్తలు తెలియజేయడం వలన ప్రజలు నీటినీ పొదుపుగా వినియోగించుకోవాలని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. 10 వ వార్డు కౌన్సిలర్ కటకం రమేష్ మాట్లాడుతూ వార్డులో ఈ మద్య చేపట్టిన కంపచెట్ల తొలగింపు, విధిదీపాల ఏర్పాటు గురించి తెలియజేసారు అలాగే కాలువల్లో చెత్త వేయకూడదు అని, ప్రజలు కూడా పరిశుభ్రత విషయంలో భాద్యతగా ఉండాలని, భూగర్భ జలాలను పెంచేందుకు ఇంకుడు గుంతలు ప్రతి ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలని అయన తెలియజేసారు. కార్యక్రమములో భాగంగా కరపత్రాలు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమము లో చైర్ పర్సన్ డా. కోడి శ్రీనివాసులు, మున్సిపల్ మేనేజర్ జి. రాములు, కౌన్సిల్ సభ్యులు కటకం రమేష్, కో- ఆప్షన్ సభ్యులు కల్లెట్ల చంద్రకళ మారయ్య, షేక్ ఖలీల్, యం.డి. సలీమా షరీఫ్, వార్డ్ ఆఫీసర్స్ జి. శ్రీరాములు, ఎ. జగన్, బి. సాయిరాం, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ యమ్. అరవింద్ రెడ్డి, బిల్ కల్లెక్టర్స్, ఆర్ పి లు, వార్డు ప్రజలు పాల్గొనడం జరిగింది.