prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 11:04 pm Digital Edition : RAKESH PEDDAPALLY

పన్నూర్ గ్రామ పంచాయతీని సందర్శించిన ZP డిప్యూటీ సీఈవో ఆకుల సంజీవరావు

డిప్యూటీ సీఈవోను శాలువాతో ఘనంగా సత్కరించిన సర్పంచ్ చిందం మహేష్.

పెద్దపల్లి జూలై28 ప్రజావాణి:

పెద్దపల్లి జిల్లా పరిషత్ (ZP) డిప్యూటీ సీఈవో ఆకుల సంజీవరావు పన్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిందం మహేష్ ఆయనకు శాలువాతో ఘన స్వాగతం పలికారు. గ్రామాభివృద్ధికి, స్థానిక సమస్యల పరిష్కారానికి జిల్లా పరిషత్ పూర్తి సహకారం అందించాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో రామగిరి MPO సమ్మిరెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.