prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 2:11 am Digital Edition : PRAJA VANI

పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సామాగ్రి అందజేసిన సర్పంచ్ దంపతులు

పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సామాగ్రి అందజేసిన సర్పంచ్ దంపతులు

 

ముఖ్యఅతిథిగా పాల్గొన్న డివిజనల్ విద్యుత్ అధికారి నంబూరి రామారావు

 

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

 

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఫేర్‌వెల్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం విద్యుత్ శాఖ డిజిటల్ ఇంజనీర్ నంబూరి రామారావు మండల విద్యాశాఖ అధికారి రామారావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పందిళ్లపల్లి గ్రామ సర్పంచ్ వత్సవాయి పద్మ చింతకాని మాజీ జడ్పీటీసీ సభ్యుడు వత్సవాయి జానికిరాములు

తమ సొంత ఖర్చులతో విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలకు అవసరమైన ప్యాడ్లు, స్కేల్స్, పెన్స్, పెన్సిల్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా పాఠశాలకు 25 కుర్చీలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేకల కల్పన పందిళ్లపల్లి వార్డ్ సభ్యురాలు మేకల నాగమణి గ్రామ పెద్దలుతో గ్రామస్తులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

చివరగా విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి ఫేర్‌వెల్ కార్యక్రమాన్ని ఆనందంగా నిర్వహించారు.