prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 6:02 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చ్ 02 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టెడ్డీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం రోజున పరీక్షా సామగ్రిని పంపిణీ చేశారు. ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు రామ్ రమేష్ తన స్వంత ఖర్చులతో ఎండపల్లి, కొత్తపేట, పాతగూడూరు గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో టెడ్డీ ఫౌండేషన్ అధ్యక్షుడు బండారి పవన్, ఉపాధ్యక్షుడు రామ్ రమేష్, సభ్యులు రామ్ రవీందర్, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.