prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 5:42 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు ఘన సన్మానం – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

*పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు ఘన సన్మానం – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్*

*నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*

నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయం లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు ఎస్.ఐ ఖలీలుద్దిన్ ఖాన్, ఏ.ఎస్.ఐ లు మట్టయ్య, రమేష్, యాదగిరి, శేఖర్ రెడ్డి ల రిటైర్మెంట్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొని, రిటైర్ అవుతున్న అధికారులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు శాఖలో సుదీర్ఘ కాలం పాటు క్రమశిక్షణతో, అంకితభావంతో సేవలు అందించిన అధికారుల కృషి వల్లే సమాజంలో శాంతి భద్రతలు పటిష్టంగా కొనసాగుతున్నాయని అన్నారు. ప్రజల రక్షణ కోసం కుటుంబాలకు దూరంగా ఉంటూ, పగలు రాత్రి తేడా లేకుండా సేవలు అందించి, పూర్తి ఆరోగ్యంతో పదవి విరమణ పొందడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. పోలీసు ఉద్యోగం కేవలం ఒక విధి మాత్రమే కాకుండా ప్రజల పట్ల బాధ్యతతో కూడిన సేవ అని పేర్కొంటూ, రిటైర్మెంట్ అనేది ఉద్యోగానికి మాత్రమేనని, పోలీస్ కుటుంబంతో అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని తెలిపారు. ఎలాంటి ఆపద వచ్చినా జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రిటైర్ అవుతున్న అధికారులు తమ సేవా కాలంలో చూపిన నిబద్ధత యువ పోలీసు సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. రిటైర్మెంట్ అనంతరం కుటుంభం సభ్యులతో, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిచారు. అనంతరం రిటైర్ అయిన అధికారులకు జ్ఞాపికలు, శాలువాలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్,ఏ.ఓ శివ ప్రసాద్, ఎస్బి సీఐ ఆది రెడ్డి, ఆర్.ఐ సంతోష్, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు జయ రాజు, పోలీస్ సిబ్బంది, రిటైర్ అవుతున్న అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.