prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 4:47 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

*పట్టుమని పోరగాన్లకు 18 ఏళ్లు సరిగ్గా నిండాలే.. కానీ బండి కొట్టేయడంలో మాత్రం మాస్టర్లే*

*పట్టుమని పోరగాన్లకు 18 ఏళ్లు సరిగ్గా నిండాలే.. కానీ బండి కొట్టేయడంలో మాత్రం మాస్టర్లే*

*నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*

మేమ్ లోకల్.. మమ్మల్ని ఎవర్ర ఆపేది.. అనుకుంటూ రాత్రిళ్లు వీధుల్లో చక్కర్లు కొడ్తూ ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన బైకులపై కన్నేసిండ్రు బుడతల గ్యాంగ్. జల్సాలకు అలవాటు పడిన ముగ్గురు మైనర్ పోరగాళ్లు. పైసల కోసం దొంగతనాల దారిలోకి దిగిండ్రు. స్కెచ్ ఏసి.. టైమ్ చూసి.. బండి స్టార్ట్ చేసి మాయం అవ్వడమే పనిగా పెట్టుకున్నారు. ద్విచక్ర వాహనాలే టార్గెట్‌గా పెట్టుకుని టూ టౌన్ పోలీసులకు టెన్షన్ తెప్పించిన గ్యాంగ్‌ ను చివరికి పోలీసులు లిఫ్ట్ చేసిండ్రు..

*టూ టౌన్ సీఐ రాఘవరావు* పర్యవేక్షణలో ఎస్సై సైదులు స్పెషల్ టీమ్ రంగంలోకి దిగింది. సీసీ కెమెరాలు, లోకల్ ఇన్ఫర్మేషన్, టెక్నికల్ ట్రాకింగ్‌తో చివరికి బుడతల ఆట కట్టించిండ్రు. దొంగతనం చేసిన బండ్లకు నంబర్ ప్లేట్లు మార్చి.. కలర్ స్టిక్కర్లు అతికించి.. పార్టులు మార్చడం లాంటివి చేసిన్నారు.

*_అంతా సినిమా స్టైల్లో ప్లాన్ వేసిండ్రట..!_*

బండి దొంగిలించి రెండు రోజులు తిరిగితే చాలు జల్సా సెట్ అనుకునే స్థాయికి వెళ్లిపోయిండ్రు కేటుగాళ్లు. ఎంత తెలివిగా ప్లాన్ వేసినా.. ఎంత లోకల్‌ వేషాలు వేసిన నల్గొండ పోలీస్ నిఘా నుంచి తప్పించుకోలేరు గా అన్నట్టుగా కేసును చేదించిన్నారు.ళమైనర్ దొంగలను గుర్తించి పట్టుకొని విచారణ జెసి జునైల్ హోం కు తరలించారు పోలీసులు. పోరగాండ్ల నుంచి పట్టుకున్న వాటిలో 3 హోండా యాక్టివాలు,1 పల్సర్ ఎన్ యస్ 200 బైక్ మొత్తం నాలుగు వాహనాలు రికవరీ చేసిన్నారు.శవాటి విలువ దాదాపు ₹3.5 లక్షల వరకు ఉంటుందన్నారు. ఈ కేసు ఛేదన లో కీలకంగా పని చేసిన కానిస్టేబుళ్లు ఎండి షకిల్, బాలకోటి లను, డీఎస్పీ శివరాం రెడ్డి, జిల్లా ఎస్పీ అధికారులు అభినందించినారు.