జగిత్యాల జిల్లా గొల్లపల్లికి చెందిన అనవేని లక్ష్మణ్ (55) పక్షవాతంతో తీవ్ర మానసిక వేదనకు గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన పెద్దపెల్లి జిల్లా ధర్మారం ఎమ్మార్వో ఆఫీసులో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. మూడేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్న లక్ష్మణ్, ఆరోగ్యం క్షీణించడంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం రాత్రి తన ఇంటి వెనుక మామిడి చెట్టుకు ఉరివేసుకున్నాడు. మృతుడి కుమారుడు సాయికుమార్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.