prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 2:39 am Digital Edition : PRAJA VANI

*పందిళ్ళపల్లి వ్యవహారంలో “నెలలు గడుస్తున్న”ఆ పంచాయతీ కార్యదర్శి పై చర్యలేవి…?<br><br>*ప్రభుత్వ నిబంధన విరుద్ధంగా వ్యవహరించారంటూ తేల్చారు..!<br><br>

*పందిళ్ళపల్లి వ్యవహారంలో “నెలలు గడుస్తున్న”ఆ పంచాయతీ కార్యదర్శి పై చర్యలేవి…?

*ప్రభుత్వ నిబంధన విరుద్ధంగా వ్యవహరించారంటూ తేల్చారు..!

*ప్రజా పాలన 99 రోజుల ప్రణాళికలోను పరిష్కారం కాకపోయే..?

మళ్లీ విచారణ అంటూ సంకేతాలు తగునా..?

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి గ్రామపంచాయతీ పరిధిలో సర్వేనెంబర్ 210 నందు ఓ బాధిత కుటుంబానికి చెందిన ఖాళీ స్థలంలో రేకుల షెడ్ను నాటి పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి బాధితులకు బాధి తకుటుంబ సభ్యులకు సమాచారం లేకుండా ఎటువంటి ముటేషన్లు లింక్ డాక్యుమెంట్లు లేకుండా కమిషన్ల కక్కుర్తికి ఇష్టానుసారంగా వ్యవహరించి పందిళ్లపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు గ్రామపంచాయతీ రికార్డులలో పేరు నమోదు చేసి తమ అధికారాన్ని నిర్లక్ష్యంగా దుర్వినియోగం చేశారని పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన బాధిత కుటుంబం ప్రజావాణి గ్రీవెన్స్ లో దరఖాస్తు చేశారు. దీనికి తోడు మన ప్రజావాణి తెలుగు దినపత్రిక పలు సమగ్ర కథనాలు అందించిన నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు నాటి డిపిఓ సుమోటోగా స్వీకరించి సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకునేందుకు ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుత ఇంచార్జ్ డిపిఓ స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం నందు విచారణ నిర్వహించారు అనంతరం ఖమ్మం జిల్లా కలెక్టరేట్లోని డిపిఓ కార్యాలయంలో మరో దశ విచారణ పూర్తి చేసి ఆ సందర్భంగా నాడు పందిళ్ళపల్లి గ్రామపంచాయతీలో 2009 2010 సంవత్సరం నందు విధులు నిర్వహించిన నాటి పంచాయతీ కార్యదర్శి  నాగేంద్రబాబుకు డిపిఓ షోకాజ్ నోటీసు జారీ 15 రోజుల్లోగా వివరణ లిఖితపూర్వకంగా అందించాలని ఆదేశించి అనేక పరిణామాల నేపథ్యంలో షోకాజ్ నోటీస్ మధిర ఎంపీడీవో కార్యాలయం నుండి మరియు రిజిస్టర్ పోస్టు ద్వారా సదరు పంచాయతీ కార్యదర్శి చేరిందని తెలిసింది. నెలలు గడుస్తున్నప్పటికీ ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి ప్లాటు మరియు రేకుల షెడ్డు వ్యవహారంలో నాటి పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు సంబంధిత విచారణలో వెలుగులోకి వచ్చినప్పటికీ ఆ మేరకు ధ్రువీకరించిన గానీ నేటి వరకు చర్యలు తీసుకోకపోవడం సర్వత్రాచర్చనీయాంశమైంది. ఇప్పటికైనా సంబంధిత జిల్లా కలెక్టర్ స్పందించి పందిళ్లపల్లి ప్లాట్ వ్యవహారంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన సంబంధిత పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకో ని భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు పాల్పడకుండా సమగ్ర చర్యలు తీసుకోవాలని బాధితులు ఒక ప్రకటనలో కోరారు.