*పందిళ్ళపల్లి మత్స్య సొసైటీ పరిధిలోకి ఊరకుంట మరో రెండు కుంటలు…!
*ప్రభుత్వనిబంధనలు ప్రకారం.. ఉన్నది ఉన్నట్లు రాస్తే… వీరంగం వేస్తున్న కాంట్రాక్టర్ “మరికొందరు” అనుచరులు
*బైలా ప్రకారం మత్స్య కార్మికుడు పాలకవర్గం లో వాళ్లు కాంట్రాక్టు పొందవచ్చా…?
*చేసేదంతా.. దందా దౌర్జన్యం.. ఆదిపత్యం నిజమేనా..?
*ఖమ్మం సిపి ఆదేశాల మేరకు స్పందించిన చింతకాని ఎస్ఐ
*వార్త కథనాలపై అక్కసు వెళ్లగకుతున్న అక్రమార్కులు
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
పందిళ్ళపల్లి మచ్చ సొసైటీ పరిధిలోకి ఊరకుంట తో పాటు రెండు కుంటలు అధికారికంగా 2021 22 సంవత్సరంలో ప్రభుత్వ జీవో ప్రకారం సొసైటీ పరిధిలోకి అధికారికంగా చేరినట్లు ప్రభుత్వ రికార్డులలో స్పష్టంగా ఉన్నట్లు మత్స్యశాఖ జిల్లా అధికారి అంగీకరించడంతోపాటు ఈ ఏడాది పెద్ద చెరువు మరో మూడు కుంటలకు మత్స్య పారిశ్రామిక సంఘం పందిళ్ళపల్లి పాలకవర్గం లీజు చెల్లించినట్లు మన ప్రజావాణి తెలుగు దినపత్రిక ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి వీరభద్రం ఆధారాలు సేకరించారు. గత కొన్ని రోజులుగా మత్స్యకారుల సమస్యలపై సమగ్ర ఆధారాలతో క్షేత్రస్థాయిలో పరిశీలించి వార్తా కథనాలు అందిస్తున్న సందర్భంలో ఇటీవల జరిగిన జనరల్ బాడీ సమావేశంలో మన ప్రజావాణి తెలుగు దినపత్రిక కథనాలపై కథనాలు అందించిన ఖమ్మం జిల్లా బ్యూరోపై కాంట్రాక్టర్ అతని అనుచరులు సాక్షాత్తు ఏడి సమక్షంలో అక్కసు వెళ్లగక్కారు. అంతటితో ఆగకుండా అంతం చేస్తామంటూ బెదిరింపులకు దిగటం కాంట్రాక్టర్ మరియు అతని అనుచరుల అరాచకాలతో సర్వసభ్య సమావేశం రసాభసాగా మారింది. సర్వసభ్య సమావేశంలో ఉన్న జిల్లా మత్స్య శాఖ సహాయ సంచాలకులు ప్రభుత్వని బంధనలు స్పష్టం చేసి గందరగోళం మధ్య వెళ్లిపోయారని తెలిసింది. కొందరు ప్రైవేటు వ్యక్తులు సర్వసభ్య సమావేశానికి హాజరై గందరగోళం సృష్టించి సంఘాన్ని బలహీనం చేసేందుకు తీవ్రంగా శ్రమించినట్లు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మత్స్య కార్మికుడు దళారీగా చేపల చెరువులను కుంటలను లీజుకు తీసుకోకూడదని అసలు దళారీ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో లేదని అధికారులు ధ్రువీకరించి మొత్తుకుంటున్నప్పటికీ కాంట్రాక్టర్ మరియు అతని అనుచరుల అరాచకాలు గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నట్లు పందిళ్లపల్లి మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు కార్యదర్శి ఆరోపిస్తున్నారు. పైగా పాలకవర్గంలోని వ్యక్తులే కాంట్రాక్టర్లుగా మారి మత్స్యకారులను తీవ్రంగా వేధిస్తున్నట్లు పలు సందర్భాలలో దౌర్జన్యకాండకు దిగినట్లు బాధిత మత్స్యకారులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. గురువారం మత్స్యకారులు ఖమ్మం సిపి కి దౌర్జన్యంపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఖమ్మం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చింతకాని ఎస్ఐ స్పందించి వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జిల్లా మత్స్య శాఖ సహాయ సంచాలకులు స్పందించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాంట్రాక్టు వ్యవస్థ లేకుండా సమగ్రమైన చర్యలు తీసుకొని మత్స్యకారులను ఆదుకోవాలని పలువురు జిల్లా మత్స్యకారులు స్థానికమత్యకారులు కోరుతున్నారు.
