prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 2:25 am Digital Edition : PRAJA VANI

పండ్ల మరియు వివిధ వ్యాపారస్తులకు స్టీల్ వాటర్ బాటిళ్ల పంపిణీ

..

డా. ఏ చంద్రప్రియ ఆధ్వర్యంలో

ప్రజా వాణి,వికారాబాద్ జిల్లా,మే 17:

స్థానికం వికారాబాద్ జిల్లా నియోజకవర్గ కేంద్రం లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వ్యాపారం చేసుకునే పండ్ల బండ్లు కూరగాయలు మరియు ఇతర వ్యాపారస్తులకు డా.ఏ.చంద్రప్రియ స్టీల్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ఎండాకాలంలో వడదెబ్బ బారిన పడకుండా,ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె తెలిపారు.ఈ సందర్భంగా చంద్రప్రియ మాట్లాడుతూ, రోజంతా ఎండలో ఉండి వ్యాపారం చేసే చిరు వ్యాపారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్టీల్ బాటిళ్లను అందించామని,ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా స్టీల్ బాటిళ్లను వాడాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు.

బాటిళ్లను అందుకున్న పండ్ల వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు.వేసవిలో తమకు ఎంతో ఉపయోగపడతాయని,చంద్రప్రియ సేవా భావానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానికులు పాల్గొన్నారు.