పంచాయతీ నిధులపై ప్రశ్నించాడన్న కోపం…వార్డు సభ్యుడిపై దాడి ఆరోపణలు.*
తిరుమలాయపాలెం, ప్రజావాణి:తిరుమలాయపాలెం మండలంలోని ఇస్లావత్ తండా గ్రామంలో గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై వివరాలు అడిగిన వార్డు సభ్యుడిపై సర్పంచ్ కుటుంబ సభ్యులు దాడి చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా తన అనుమతి లేకుండానే సర్వసభ్య సమావేశ రిజిస్టర్‌లో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ వార్డు సభ్యుడు ఇస్లావత్ రాజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.బాధితుడి వివరాల ప్రకారం గ్రామపంచాయతీ సెక్రటరీ మార్చి 17, 2026 ఉదయం 10 గంటలకు సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు తెలియజేస్తూ వార్డు...