prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 1:40 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

న్యాయవాదులు న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని


కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) కడప మన ప్రజాస్వామ్య దేశంలోని కార్యనిర్వాహక వ్యవస్థలు చట్టబద్ధంగా నడవకుండా ఉన్న సమయంలో ఆ వ్యవస్థలను చట్టబద్ధంగా నడిచే విధంగా చేసే న్యాయ వ్యవస్థ గొప్పతనాన్ని నిలబెట్టే బాధ్యత న్యాయవాదులపైనే ఉంటుందని కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని అన్నారు. భారత న్యాయవాదుల సంఘం ఐఏఎల్ కడప ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నూతన కడప నగర కమిటీ అధ్యక్షులు వి.రాజగోపాల్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ అనురాధ, ప్రధాన కార్యదర్శి నాగ అర్చన, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఏ బాలసుబ్బయ్య, నగర ఆర్గనైజర్ కార్యదర్శి రాజశేఖర్ ఉపాధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి కార్యదర్శి వేణుగోపాల్,బాలయ్య తదితరులు గురువారం గౌరవార్థం జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన సందర్భంగా ఆమె మాట్లాడారు,న్యాయవ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని డిగ్నిటీని కాపాడాల్సిన బాధ్యత కూడా న్యాయవాదులపై ఉంటుందని ముఖ్యంగా న్యాయవాద సంఘాల నాయకుల పై మరింతగా బాధ్యత ఉంటుందని ఆమె అన్నారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తికి బొకేెను అందజేస్తున్న ఐ ఏ ఎల్ నగర కమిటీ