prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 6:54 am Digital Edition : PRAJA VANI

నైపుణ్య శిక్షణ తోనే గిరిజన యువతకు ఉజ్వల భవిష్యత్తు ఎమ్మెల్యే జారే

*నైపుణ్య శిక్షణతోనే గిరిజన యువతకు ఉజ్వల భవిష్యత్తు:ఎమ్మెల్యే జారే*

*ఐ టీ డి ఏ భద్రాచలం ఆధ్వర్యంలో గిరిజన యువతకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి అవకాశాలను ప్రారంభించిన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

అశ్వారావుపేట, ప్రజావాణి న్యూస్ , జూలై 22:
భద్రాచలం ITDA (సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి కల్పన కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాలలోని గిరిజన యువత నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, శిక్షణ కోర్సుల వివరాలను విద్యార్థులకు వివరించారు.గిరిజన యువతీ యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ గిరిజన యువతను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. యువత సమయాన్ని వృథా చేయకుండా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచిస్తూ”కాలం అందరికీ ఒకే సమయాన్ని ఇస్తుంది, కానీ దాన్ని ఎలా వాడుకుంటారనేదే నీ గమ్యాన్ని నిర్ణయిస్తుంది.”అని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పేర్కొన్నారు. ప్రైవేట్ రంగంలో వస్తున్న అవకాశాలను అందుకోవడానికి సరైన శిక్షణ ఎంతో అవసరమని, జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు భయపడకూడదని చెప్పారు
“కష్టాలు మనల్ని నాశనం చేయడానికి రావు, మనలో ఉన్న అద్భుతమైన శక్తిని బయటకు తీయడానికి వస్తాయి.”అని యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు.ఈ శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి, యూనిఫాం మరియు స్టడీ మెటీరియల్స్ ఉచితంగా అందిస్తున్నారని వివరించారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్టిఫికేట్‌తో పాటు ప్రముఖ కంపెనీలలో 100% ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.18 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగిన గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ టైలర్ (9వ తరగతి అర్హత), బ్యూటీ థెరపిస్ట్, కన్సైన్‌మెంట్ బుకింగ్ అసిస్టెంట్, బ్రైడల్ ఫ్యాషన్ మరియు మేకప్ ఆర్టిస్ట్ (10వ తరగతి అర్హత) వంటి కోర్సులతో పాటు ఐటీ స్కిల్స్, ఏఐ ప్రమోటింగ్, ఫోటోషాప్, అడ్వాన్స్‌డ్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు సాఫ్ట్ స్కిల్స్‌లో కూడా శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పి ఓ రాహుల్ ఐఏఎస్ ,మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు ,ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రం ,ఐటీడీఏ అధికారి డేవిడ్ రాజు , మున్సిపాలిటీ కమిషనర్ దిలీప్ రెడ్డి,ఎంపీడీఓ కిషోర్ , ఎమ్మార్వో ,జూపల్లి ప్రమోద్ ,కోల లక్ష్మి నారాయణ, యూత్ కాంగ్రెస్ నాయకులు కాక రమేష్ ,సత్యనారాయణ ,ఐటీడీఏ అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు మరియు గిరిజన యువతీ యువకులు పాల్గొన్నారు.